Home / Sports News / భారత్ ను మట్టి కరిపించిన పాకిస్తాన్
Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News
India vs Pakistan final 2017

భారత్ ను మట్టి కరిపించిన పాకిస్తాన్

ఐసీసీ కి సంబందించిన టోర్నమెంట్ లో 1985 తరువాత మళ్ళి 32 సంవత్సరాల తరువాత గెలిచింది.మొదట బాటింగ్ లో విజృంభించిన పాకిస్తాన్ తరువాత బౌలింగ్ లోను రాణించింది.బ్యాటింగ్,బౌలింగ్ రెండింటి లోను భారత్ విఫలమయ్యింది.తొలుత బుమ్రా బౌలింగ్ లో ఫాఖర్ జమాన్ ధోని కి క్యాచ్ ఇచ్చాడు.కానీ నో బాల్ కావడంతో బతికిపోయాడు.అజర్ అలీ,ఫాఖర్ జమాన్ తోలి వికెట్ కు 128 పరుగులు జోడించారు.చివర్లో మొహమ్మద్ హఫీజ్ 37 బంతుల్లో 57 పరుగులు సాధించాడు.నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్తాన్ 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు సాధించింది.
బుమ్రా 9 ఓవర్లలో 68 పరుగులు,అశ్విన్ 10 ఓవర్లలో 70 పరుగులు,జడేజా 8 ఓవర్లలో 67 పరుగులు సమర్పించుకున్నారు.భువనేశ్వర్ 10 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు.హార్దిక్ పాండ్య 10 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు.కేదార్ జాదవ్ 3 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు.

Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News

Pakistan won Champions Trophy Title

339 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన భారత్ ఏ దశ లోను లక్ష్యం దిశగా సాగలేదు.తోలి ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మను అవుట్ చేసిన ఆమిర్,మూడో ఓవర్ లో కోహ్లీని,తొమ్మిదో ఓవర్ లో ధావన్ ను వెనక్కి పంపాడు.యువరాజ్ ను షాదాబ్ ఖాన్,ధోని ని హాసన్ అలీ వెనక్కి పంపారు.కేదార్ జాదవ్ కూడా షాదాబ్ ఖాన్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.దీనితో 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.ఈ దశలో హార్దిక్ పాండ్య రెచ్చిపోయాడు.43 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.152 పరుగుల వద్ద హార్దిక్ పాండ్య అవుట్ అవ్వడంతో మళ్ళి వరుసగా వికెట్లు పడ్డాయి.158 పరుగులకే భారత్ ఆల్ అవుట్ అయ్యింది.

Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News

Pakistan won 2017 Champions Trophy

భారత్ ఫై 180 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలిచింది.ఫాఖర్ జమాన్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ,హాసన్ అలీ కి మ్యాన్ అఫ్ ది సిరీస్ లభించింది.శిఖర్ ధావన్ కు గోల్డెన్ బాట్ ,హాసన్ అలీ కి గోల్డెన్ బాల్ లభించాయి.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News

పాకిస్తాన్ తో ఫైనల్ పోరుకు సిద్దమయిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా జరిగిన రెండవ సెమీ ఫైనల్లో టీమ్ ఇండియా బంగ్లా బేబీ ...

Watch Dragon ball super