Home / Movie Reviews / కాదలి సినిమా రివ్యూ
New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News
Kaadali Telugu Movie Review

కాదలి సినిమా రివ్యూ

నటీనటులు: హరీష్ కళ్యాణ్,సాయి రోనక్,పూజ కె.దోషి,సుదర్శన్,భద్రం,భాను తదితరులు
సంగీతం: పవన్,ప్రసూన్,శ్యామ్
ఛాయాగ్రహణం: శేఖర్ వి.జోసెఫ్
కథ-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి చిలుకూరి

అప్పుడప్పుడు చిన్న సినిమాలు కొన్ని ఆసక్తిని రేకెత్తిస్తాయి.కేటీఆర్ మిత్రుడైన పట్టాభి చిలుకూరి అనే కొత్త దర్శకుడు రూపొందించిన కాదలి సినిమా కూడా ఇలాంటిదే.ప్రోమోస్ బాగుండటం,ట్రై యాంగిల్ లవ్ స్టోరీ,అందమయిన హీరోయిన్,ఆడియో లాంచ్ కి కేటీర్,రామ్ చరణ్ రావడం,గట్టిగ ప్రమోషన్ చేయడం వల్ల సినిమా మీద మంచి అంచనాలున్నాయి.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

Kaadali Movie Photo

 

 

బాంధవి వరదరాజన్ హైదరాబాద్ లో ఉన్న తెలుగు అమ్మాయి.ఫిజియో థెరపిస్టుగా పని చేసే ఈ అమ్మాయికి కుటుంబ సమస్యల వల్ల పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.అప్పుడు కార్తీక్,క్రాంతి అనే ఇద్దరు అబ్బాయిలు పరిచయ మవుతారు.అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు నచ్చుతారు.ఇద్దరు అబ్బాయిలకు అమ్మాయి నచ్చుతుంది.చివరకి ఎవరు ఎవరిని చేసుకున్నారన్నదే ఈ సినిమా కథ.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

Kaadali Telugu Movie Review

 

 

 

కాదలి సినిమాలో హీరోయిన్ అందంగా ఉంది.తన అభినయం తో ఆకట్టుకుంది.ఇద్దరు హీరోలు కూడా బాగానే ఉన్నారు.కానీ కథ సరిగా లేకుంటే ఇవన్నీ ఎందుకు పనికి రావు.మలుపుల్లేని, ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలూ లేని,ఫ్లాట్ గా సాగిపోయే బోరింగ్ లవ్ స్టోరీ కాదలి సినిమా.

సినిమా టైటిల్ లో రెస్పెక్ట్ హర్ ఛాయిస్ అనే టాగ్ లైన్ ఉంటుంది.కానీ కథకు దానికి ఎలాంటి సంబంధం లేదు.ఇద్దరి అబ్బాయిలతో ఆడుకున్న అమ్మాయి కథ అని సినిమా టైటిల్ పెడితే బాగుంటుంది అని చాలామందికి అనిపిస్తుంది.ఒక దిశా,దశ లేని ఈ సినిమాలో ఇంటర్వెల్ సాంబునికి ఇద్దరి హీరో లలో ఒకరిని ఎంచుకోవాలిసి వస్తుంది.ఇక అక్కడ నుండి సినిమా బోర్ కి పర్యాయ పదం లాగా తయారయ్యింది.క్లైమాక్స్ కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించదు.కామెడీ కూడా లేక పోవడం సినిమాకు మైనస్.
సంగీతం ఒక్కటే సినిమాకు ప్లస్.పవన్,ప్రసూన్,శ్యామ్ మంచి సంగీతం,నేపధ్య సంగీతం ఇచ్చారు.శేఖర్ వి.జోసెఫ్ ఛాయా గ్రహణం కూడా బాగుంది.హీరో హీరోయిన్లు కూడా బాగానే మెప్పించారు.కథే కాదలి సినిమాకు పెద్ద లోటు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ సినిమా రివ్యూ

నటీనటులు: సుమంత్ అశ్విన్,అనీషా ఆంబ్రోస్,మనాలి రాథోడ్ , మానస,కృష్ణభగవాన్,వంశీ నక్కంటి తదితరులు సంగీతం: మణిశర్మ ఛాయాగ్రహణం: ...

Watch Dragon ball super