సినిమా ఇండస్ట్రీలో తండ్రీ కొడుకులు ఇద్దరితోను హీరోయిన్ గా నటించిన రికార్డు పలువురు భామలు సొంతం చేసుకున్నారు.ముందు తండ్రితోను తర్వాత కొడుకుతోను సినిమాలు చేసిన సుందరాంగులు ఉన్నారు.ఇదే ఫీట్ ను రివర్స్ లో చేసింది కాజల్.దీనికి భిన్నంగా ఒకేసారి తండ్రీకొడులతో హీరోయిన్ గా నటించే అరుదైన అవకాశం మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

Ram Charan and Chiranjeevi Wants Aishwarya Rai
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధను తన 151వ సినిమా గా మెగా స్టార్ చిరంజీవి చేయనున్నారు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ ఫిలిం మొదట తెలుగులో మాత్రమే తీయాలనుకున్నారు.కానీ తరువాత దీని తమిళం,హిందీలో కూడా తెరకెక్కించాలనుకున్నారు.ఈ సినిమా కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నారు.వాళ్ళు ఐశ్వర్యారాయ్ కోసం ప్రయత్నిస్తున్నారు.కాన్సెప్ట్ బేస్డ్ మూవీ,పాత్రకు ప్రాధాన్యత ఉండటం తో ఐశ్వర్యారాయ్ ఒప్పుకోవచ్చనే అనుకుంటున్నారు.

uyyalawada narasimha reddy
రామ్ చరణ్, మణిరత్నం కాంబినేషన్ లో కూడా సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుందనే టాక్ ఉంది.ఈ సినిమాకి కూడా హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ నే అనుకుంటున్నారట.ఇప్పటికి ఇద్దరు,గురు,రావణ్ సినిమాల్లో నటించిన ఐశ్వర్యారాయ్ ఈ సినిమా కూడా చేస్తుంది అనే అనుకుంటున్నారు.ఉయ్యాలవాడ షూటింగ్ మొదలైంది.చరణ్ సినిమా కూడా సుకుమార్ సినిమా తరువాత చరణ్ మణిరత్నం సినిమా చేస్తాడనే టాక్ కూడా ఉంది.దీనితో తండ్రీ కొడుకులు ఇద్దరితోనూ ఒకేసారి హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ నటించనుంది.

AIsh Ramcharan