Home / Movie Reviews / ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ సినిమా రివ్యూ
New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News
Fashion Designer Movie Review

ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ సినిమా రివ్యూ

నటీనటులు: సుమంత్ అశ్విన్,అనీషా ఆంబ్రోస్,మనాలి రాథోడ్ , మానస,కృష్ణభగవాన్,వంశీ నక్కంటి తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: వంశీ
సితార,లేడీస్ టైలర్,అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల లాంటి సినిమాలు తీసిన సీనియర్ డైరెక్టర్ వంశీ చివరి హిట్టు సినిమా 2002 లో వచ్చిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా.ఆ తరువాత ఆరు సినిమాలు తీసిన మెప్పిఞ్చ లేకపోయాడు.వాటిలో సరదాగా కాసేపు కొంచెం పర్వాలేదు.దానితో ఈ సినిమా గురించి పెద్దగా అంచనాలు లేవు.ఎప్పుడైతే మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యిందో అప్పుడు ఈ సినిమా మీద బజ్ క్రీయేట్ అయ్యింది.లేడీస్ టైలర్ కు సీక్వెల్ గా వంశీ తీసిన ఫ్యాషన్ డిజైనర్ ఈ మేరకు జనాలను ఆకట్టుకుంటుందో చూద్దాం.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

Fashion Designer Movie Photos

లేడీస్ టైలర్ గా గొప్ప పేరు సంపాదించిన సుందరం కొడుకు గోపాళం.తండి వారసత్వాన్ని కొనసాగిస్తూ లేడీస్ టైలర్ గానే ఉంటాడు.అయితే తండ్రి లాగే పల్లెటూరిలో కాకుండా టౌన్ కి వెళ్లి ఫాషన్ డిజైనర్ కావాలనేది అతని కోరిక.అది నెరవేర్చుకోవడానికి ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.ముందుగా గేదెల రాణి మానస ను ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తాడు.తర్వాత ఆమె కంటే డబ్బున్న అమ్ములు ను ప్రేమిస్తాడు.తర్వాత వేళ్ళ కంటే ధనవంతురాలయిన మహా లక్ష్మిని ప్రేమిస్తాడు.ముగ్గురితో సాగించిన ప్రేమల వల్ల గోపాళం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు,చివరికి అతడి జీవితం ఎవరితో ముడిపడింది అనేది మిగిలిన కథ.

ఈ సినిమాలో హీరో ముగ్గురమ్మాయిలతో ప్రేమాయణం నడిపిస్తాడు.మొదట గేదెల రాణితో ప్రేమ గురించి మాట్లాడుదాం.ఒక లేజర్ లైట్ పాయింటర్ పట్టుకెళ్లి స్నానం చేస్తున్న ఆ అమ్మాయి మీద వేస్తాడు.ఒక పరిచయం లేని అమ్మాయి మీద ఎవరైనా ఆలా చేస్తే అమ్మాయి కంగారు పడాలి.కానీ లాజిక్ లేని సినిమా కావడం వల్ల ఆ అమ్మాయి లైటు తో ఆడుకుంటుంది.ఆ అమ్మాయి కోసం హీరో రాగానే ఎగిరి అతడి మెడ మీద కూర్చుని తన కామోద్రేకాన్ని చాటుతుంది.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

Fashion Designer Movie Photos 2

ఈ సినిమాలో మోటు రొమాన్స్ గురించి మాట్లాడాలి.అమ్మాయిని ఎగిరి ఎగిరి తన్నడం,చెట్టక్కి కొబ్బరి కాయలు మీద పడేయడం, ఇసుక బస్తాలు వేయడం లాంటివి చూస్తే పిచ్చికి పరాకాష్ట అనిపిస్తుంది.ఈ మితిమీరిన శృంగారం కథ,కథనాన్ని మింగేసింది.వినోదానికి కూడా పెద్ద పేట వేయలేదు.ఒక్క కృష్ణ భగవాన్ కామెడీ మాత్రమే సినిమాలో కొంచెం రిలీఫ్.సాధారణంగా సీక్వెల్ అనగానే ముందు సినిమాతో పోల్చి చూస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీయాలి.కానీ ఇక్కడ పరిస్థితి వేరు.సుందరానికి గోపాళం తూగడు. బట్టల సత్యంను చూసిన కళ్లకు పండు గాడు ఆనడు. హీరోయిన్ల సంగతీ అంతే.కామెడీ కూడా సరిగా లేదు.మొత్తంగా లేడీస్ టైలర్ కి పూర్తి వ్యతిరేకం గ ఉంటుంది ఈ సినిమా.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

Fashion Designer son of Ladies Tailor Movie Review

కొన్నేళ్లుగా వంశీ సినిమాలు అన్ని ఇలాగే సాగుతున్నాయి.పోనీ ప్రేమకథ అంటే పేరుకు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కానీ ఒక్క ప్రేమకథ కూడా లేదు.హీరో ను చూడగానే అమ్మాయిలు పడిపోతారు.రొమాంటిక్ ఫీల్ కూడా లేదు.క్లైమాక్స్ కూడా మాములే.మేఘాల్లో తేలిపోతున్నా పాట మాత్రం చాల బాగా తీశారు.సహజత్వంతో కథలు రాసే వంశీ ఇలా ఒక మూసలోకి వెళ్ళిపోయాడు.సినిమా రిలీజ్ కు ముందు పూర్తి భిన్నంగా ఉంటుందని అని వంశీ అన్నాడు కానీ సినిమా చూస్తే మాత్రం ఆయన గత కొన్నేళ్లలో తీసిన సినిమాలకు భిన్నంగా ఏమీ అనిపించదు.
రేటింగ్: 2 / 5

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

అమీ తుమీ తెలుగు సినిమా రివ్యూ

టైటిల్ : అమీ తుమీ జానర్ : కామెడీ ఎంటర్ టైనర్ తారాగణం : అడవిశేష్, ...

Watch Dragon ball super