Home / Political news / అమరావతిని ముట్టడిస్తామంటున్న మంద కృష్ణ మాదిగ
Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News
Manda Krishna Madiga

అమరావతిని ముట్టడిస్తామంటున్న మంద కృష్ణ మాదిగ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని నమ్మించి మోసగించిన చంద్ర బాబు పై రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను తప్పుబట్టారు. గత ఎన్నికల్లో విశాఖ వేదికగా ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగగా నిలుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అదే వేదికగా నిర్వహించిన మహానాడులో వర్గీకరణపై తీర్మానం చేయకపోవటాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన మహానాడులో మాత్రం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తీర్మానం చేయడం చంద్రబాబు ద్వంద వైఖరికి నిదర్శనమని మందకృష్ణ విరుచుకుపడ్డారు. ఎంఆర్ పీఎస్ 23వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 7వ తేదీన అమరావతిలో నిర్వహించనున్న కురుక్షేత్ర మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ మందకృష్ణ మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేనిదే కాపులను బీసీల్లో చేర్చడం వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం కలలో కూడా జరగని పని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ సానుకూలంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని తొక్కి పెడుతున్నారని మందకృష్ణ అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలిచిన మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.10లక్షల మంది మాదిగలతో సునామీలా అమరావతిని గడ్డను తాకి చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తామని సవాల్ విసిరారు. కురుక్షేత్ర మహాసభలోగా ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పాలని డిమాండ్ చేశారు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

జగన్ పై విరుచుకు పడిన పవన్ కళ్యాణ్

Watch Dragon ball super