Home / Movie Reviews / రారండోయ్ వేడుక చూద్దాం తెలుగు సినిమా రివ్యూ
New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News
rarandoy veduka chuddam

రారండోయ్ వేడుక చూద్దాం తెలుగు సినిమా రివ్యూ

సినిమా టైటిల్ : రారండోయ్ వేడుక చూద్దాం
జానర్ : ఫ్యామిలీ డ్రామా
తారాగణం : నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్, వెన్నెల కిశోర్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : నాగార్జున అక్కినేని

ప్రేమమ్ సినిమా తో హిట్టు కొట్టిన నాగచైతన్య మల్లి తనకు అచొచ్చిన రొమాంటిక్ ఫామిలీ డ్రామా సబ్జెక్టును ఎంచుకున్నాడు.ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ ఫై నాగార్జున నిర్మించాడు.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

rarandoy veduka chuddam

ఇంకా కథలోకి వస్తే భ్రమరాంబ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన పల్లెటూరి అమ్మాయి.గారాబంగా పెరిగిన భ్రమరాంబకు తండ్రి అంటే ఎంతో ఇష్టం.ఎలాంటి మొహమాటం లేకుండా అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడడం చెప్పేయడం భ్రమరాంబ అలవాటు.ఒకసారి తన కజిన్ పెళ్లిలో భ్రమరాంబను చూసిన శివ (నాగచైతన్య) తొలి చూపులోనే ప్రేమిస్తాడు.పెళ్లి తరువాత తను సిటీకి వెళ్ళిపోతాడు.భ్రమరాంబ కూడా చదువు కోసం సిటీకి వస్తుంది.ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ తిరుగుతుంటారు.తరువాత శివ తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతనికి దూరమవుతుంది. తరువాత తిరిగి ఎలా కలిశారు అనేది మిగిలిన కథ.

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో మాస్ ఆడియన్స్ కు దగ్గరైన నాగచైతన్య మరోసారి ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాతో మెప్పించాడు. నటుడిగానూ పరిణతి కనబరిచాడు. భ్రమరాంబతో విడిపోయే సన్నివేశాల్లో నాగచైతన్య నటన ఆకట్టుకుంటుంది. భ్రమరాంబగా రకుల్ ప్రీత్ సింగ్ సూపర్బ్ గా ఉంది. కథ అంతా రకుల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. లుక్స్ పరంగా పల్లెటూరి అమ్మాయిగా అమాయకంగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించింది. తండ్రి పాత్రలో జగపతి బాబు, సంపత్ లు మరోసారి మెప్పించారు.వెన్నెల కిశోర్ కామెడీ కూడా బాగుంది.

కాకపోతే రొటీన్ కథ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా అంతగా కుదరలేదు .ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ కొడుతోంది.నాగచైతన్య,రకుల్ యాక్టింగ్ జనాలను థియేటర్ కు రప్పిస్తుంది.సెకండ్ హాఫ్ బాగుంది.దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది.ఎడిటింగ్, సినిమాటోగ్రఫి స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

మరీ ప్రెస్ మీట్లో నాగార్జున చెప్పినట్టు కాకపోయినా సినిమా చూడటానికి మాత్రం పర్వాలేదు.మరి ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తే మాత్రం అంతగా రుచించదు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

అమీ తుమీ తెలుగు సినిమా రివ్యూ

టైటిల్ : అమీ తుమీ జానర్ : కామెడీ ఎంటర్ టైనర్ తారాగణం : అడవిశేష్, ...

Watch Dragon ball super