Home / Political news / ఇప్పుడే ఎన్నికలొస్తే మోడీ సారధ్యం లోని బీజేపీ పరిస్థితి
Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News
Political breaking news on Modi and BJP Government

ఇప్పుడే ఎన్నికలొస్తే మోడీ సారధ్యం లోని బీజేపీ పరిస్థితి

నరేంద్ర మోడీ మూడు సంవత్సరాల పాలనకు ప్రజలు మంచి మార్కులే వేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న మోడీ ప్రభుత్వానికి జనామోదం కనిపిస్తోంది. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగ్లో దాదాపు 10 లక్షల మందికి పైగా పాల్గొనగా అందులో అధిక శాతం మోడీకి మద్దతుగా ఓటేశారు.

మోడీ ప్రభుత్వ పాలన కు మీరు ఏ విధంగా స్పందిస్తారు అన్న ప్రశ్నకు 77 శాతం మంది చాలా బాగుందని ఓట్ చేసినట్టు సర్వేలో తేలింది. జీఎస్టీ ,నోట్ల రద్దు రక్షిత దాడులు ,స్వచ్ఛ భారత్,అభియాన్ వంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేశాయని వెల్లడైంది. అధికశాతం ప్రజలు నోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయానికి కూడా మద్దతు పలకడం విశేషం.

కాగా దక్షిణ భారతంలో మోడీ సర్కారుకు కొంత వ్యతిరేక ఫలితాలు వెల్లడయ్యాయి. వ్యవసాయరంగం తిరోగమనం బీజేపీ సర్కారుకు పెద్ద వైఫల్యమని సర్వేలో తేలింది. తమిళనాడు ప్రజానీకాన్ని మోడీ పరిపాలన పెద్దగా ఆకర్షించలేదు.

కాగా ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే మోడీ సర్కారు 2014 ఎలక్షన్స్ కంటే అద్భుత ఫలితాలను సాధిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్లేషించింది. సర్వేలో పాల్గొన్న వారిలో మొత్తం 84 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 61 శాతం మంది మాత్రం 2014 ఎన్నికలంత ఘన విజయం లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 23 శాతం మంది మాత్రం 2014 ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమవుతాయని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ , సీపీఐ మద్దతుదారులుగా భావిస్తున్న వారిలో 74 శాతం మంది కూడా బీజేపీనే గెలుస్తుందని చెప్పడం విశేషం.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

జగన్ పై విరుచుకు పడిన పవన్ కళ్యాణ్

Watch Dragon ball super