Home / Movie Reviews / కేశవ మూవీ రివ్యూ
New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News
Keshava Movie

కేశవ మూవీ రివ్యూ

నటీనటులు: నిఖిల్,రీతూ వర్మ,ఇషా కొప్పికర్,రావు రమేష్,అజయ్,బ్రహ్మాజీ,ప్రియదర్శి,వెన్నెల కిశోర్,సుదర్శన్,సత్య ,మధునందన్,రాజా రవీంద్ర,రవిప్రకాష్,సమీర్ తదితరులు
సంగీతం: సన్నీ ఎం.ఆర్
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
నిర్మాత: అభిషేక్ నామా
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సుధీర్ వర్మ

 

నిఖిల్ కెరీర్ ను మార్చిన సినిమా స్వామి రారా.ఆ సినిమా ఎంత ప్రభావం చుపించిందంటే ఆ తరువాత నిఖిల్ సినిమా లు అన్ని బయ్యర్లకు లాభాలు తెచ్చినవే.అంతకుముందు నిఖిల్ సినిమాలు కొన్ని ఆడినప్పటికీ వరుసగా హిట్లు రాలేదు.కానీ స్వామి రారా నుంచి వరుసగా హిట్లు వచ్చాయి.అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ వచ్చాడు.ఈ సినిమా కూడా ఆ కోవలోనిదే.
కాన్సెప్ట్ ప్రకారం చూస్తే మాములు రివెంజ్ స్టోరీ.కానీ తెరకెక్కిన విధానం బాగుంది.కేశవ లా కాలేజీ విద్యార్థి. అతికి గుండె కుడివైపున ఉంటుంది. ఆవేశ పడ్డా ఉద్వేగానికి గురైనా అతడి ప్రాణానికే ప్రమాదం. అలాంటి వాడు కొందరు పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తూ వెళ్తాడు. ఏ క్లూ వదలకుండా రెండు హత్యలు చేసిన అతను మూడో హత్య చేశాక పోలీసులకు దొరికిపోతాడు. ఇంతకీ అతనీ హత్యలు ఎందుకు చేశాడు.. అతడి గతమేంటి.. పోలీసుల నుంచి అతను ఎలా బయటపడ్డాడు. మిగతా వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే మిగిలిన కథ.

మాములు కథను చెప్పే తీరులో అంటే స్క్రీన్ ప్లే లో మార్పులతో కథను కొంచెం గ్రిప్పింగ్ గ తెరకెక్కిస్తే జనాలకు నచుతుంది.కేశవ లో సుధీర్ వర్మ చేసింది అదే.నిఖిల్ సిన్సియర్ యాక్టింగ్ తోడవడంతో ‘కేశవ’ చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ వచ్చే సన్నివేశాలు అంత సరదాగా సాగిపోతాయి. హడావుడి లేకుండా సటిల్ గా సాగే వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుంది. ఇలాంటి సినిమాలో కామెడీ ఏంటి అనిపించకుండా.. కథకు అడ్డం పడకుండా సాగుతుంది ఈ ట్రాక్. గంట నిడివి ఉన్న ప్రథమార్ధంలో బోర్ కొట్టించే మూమెంట్స్ పెద్దగా ఏమీ లేవు.
ఐతే విరామం వరకు ‘కేశవ’ను గ్రిప్పింగ్ గా నడిపించిన సుధీర్ వర్మ ద్వితీయార్ధంలో ఆ బిగిని కొనసాగించలేకపోయాడు. హీరో పోలీసుల నుంచి బయటపడే సన్నివేశాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. ఇక్కడ సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా వాడేసుకున్నాడు సుధీర్. పోలీసులకు హత్యలు చేసిందెవరో పక్కాగా తెలిసినా మీడియాలో రగడ అవుతోందని నిందితుడిని వదిలేయడం అతను ఆ తర్వాత కూడా తనపాటికి తాను హత్యలు చేసుకుంటూ వెళ్లడం విలన్ల వైపు నుంచి హీరోకు కౌంటర్ అటాక్ లేకపోవడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఐతే మామూలుగా ముగిసేలా కనిపించే కేశవ చివర్లో మళ్లీ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. క్లైమాక్స్ ట్విస్టు.. హీరో తన పగకు తెరదించే పతాక సన్నివేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.మైనస్సులూ ఉన్నప్పటికీ కేశవను ఒక్కసారి చూసేందుకు ఢోకా లేదు.
కేశవ ఎంగేజింగ్ థ్రిల్లర్

రేటింగ్- 2.75/5

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

అమీ తుమీ తెలుగు సినిమా రివ్యూ

టైటిల్ : అమీ తుమీ జానర్ : కామెడీ ఎంటర్ టైనర్ తారాగణం : అడవిశేష్, ...

Watch Dragon ball super